Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మరో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టిడిపి కార్యకర్తల దాడి.... ఇంట్లోకి చొరబడి సామాగ్రి ధ్వంసం...ఇంటికి నిప్పు

01 Feb 2026
05:32 PM
109

AP:

గుంటూరులో నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటన మరువక ముందో మరో మాజీ మంత్రి ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్  నేత జోగిరమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు.  ఈ పరిణామాలతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటన జరిగిన సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని సమాచారం. ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో వస్తువులు దగ్దమవుతుండగా టిడిపి కార్యకర్తలు ఇంటి బయట రణరంగాన్ని సృష్టించారు. దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని, అందువల్లే టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నారు. కొంత సేపటి తరువాత పోలీసులు టిడిపి కార్యకర్తలను చెదరగొట్టారు. Article Image

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!