Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరం.... రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

01 Feb 2026
03:01 PM
42


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి భారీ వరం లభించింది. ఏపీలో అరుదైన ఖనిజాల వెలికితీత, వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీపికబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపోతే పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026-27లో నిర్మాల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖనిజ సంపద కలిగి ఉన్న నేపథ్యంలో అరుదైన ఖనిజాల వెలికితీత, వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025లో ప్రారంభించిన అరుదైన ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ పథకానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.ఇందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.


తీర ప్రాంతాల్లో ఖనిజ సంపద, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక‘రేర్ ఎర్త్ కారిడార్లను’ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025లో ప్రారంభించిన అరుదైన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ పథకానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఈ కారిడార్లు ఎంతో దోహదపడతాయి అని కేంద్రమంత్రి పేర్కొంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!