Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్... • గుంటూరులో తీవ్ర ఉద్రక్తత .... • నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు...

01 Feb 2026
12:30 AM
115

గుంటూరులో తీవ్ర ఉద్రక్తత ....
• నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు...
• అంబటిని తరలిస్తున్న వాహనంపై కోడిగుడ్ల దాడి...
• అరెస్ట్ అనంతరం ఇంటిపై దాడి.... నివాసానికి నిప్పు పెట్టిన టిడిపి కార్యకర్తలు...
• అంబటికి భయం రావాలి.. తీయండిరా" అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోతూ దాడులు....

 

Article ImageArticle Image

 

 

 

గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా భారీగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అంబటి రాంబాబును అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో ఆయనను తీసుకెళ్తున్న వాహనంపై దాడికి యత్నం జరిగింది. కొందరు టీడీపీ ఆందోళనకారులు వాహనంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ గందరగోళంలో అంబటి నివాసం వద్ద తోపులాట జరగగా పలువురు గాయపడినట్లు సమాచారం.

అంబటి అరెస్ట్ అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లరి మూకలు అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగాయి. తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో అంబటి నివాసానికి నిప్పు పెట్టడంతో గుంటూరు ఒక్కసారిగా భయానక పరిస్థితిని ఎదుర్కొంది. "భయం రావాలి.. తీయండిరా" అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోతూ దాడులు చేసిన వీడియోలు వైరల్గా మారాయి. ఇంటికి నిప్పు పెట్టిన అనంతరం అంబటి రాంబాబు కారును తగలబెట్టారు.

సాయంత్రం అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రీ ప్లాన్డ్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే అంబటిపై టీడీపీ శ్రేణులు హత్యాయత్నం చేశారని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సీఎంను దూషించారన్న కారణంతో ఒకవైపు అరెస్ట్, మరోవైపు ఇంటిపై దాడులు, నిప్పుపెట్టడం వంటి ఘటనలు రాష్ట్రంలో రాజకీయ హింస ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా చూపిస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!