Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

సిఎంకు మంచి బుద్దిని ప్రసాదించాలంటూ ..... మాజీ సిఎం సొంత జిల్లాలో ఆలయాల్లో పూజలు....

31 Jan 2026
04:52 PM
205

తిరుమల లడ్డు వివాదం  :

స్వార్థ రాజకీయాల కోసం  కూటమి నాయకులు తిరుమల లడ్డు వదలని లేదని సిబిఐ నివేదికతోనైనా చంద్రబాబుకు మంచి బుద్ధుని ప్రసాదించాలంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసిపి నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వార్ధ రాజకీయాల కోసం దేవుని వాడుకోవడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

పులివెందులలో  :

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై అసత్య, విష ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పులివెందులలో వైయస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు. ఈ సందర్బంగా స్వామివారిని ప్రార్థిస్తూ,
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నారు. ఎలాంటి అవగాహన లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం వైయస్ఆర్ సీపీపై బురద జల్లాలనే ఉద్దేశంతో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధపు ఆరోపణలు చేయడం హిందూ ధర్మాన్ని అవమానించడమేనని తీవ్రంగా ఖండించారు.
ప్రజల మనోభావాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
Article Image





కమలాపురంలో  :

కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో పాపప్రక్షాళన పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు.
స్వార్థ రాజకీయాల కోసం తిరుమల లడ్డును  కూటమి నాయకులు వదల్లేదని నరేన్ రామాంజులరెడ్డి మండిపడ్డారు. పరమ పవిత్రమైన తిరుమలలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో భక్తుల్ని మానసిక క్షోభకు గురిచేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల  పాపానికి పరిహారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించామన్నారు. అతి పవిత్రమైన లడ్డును జంతువుల కొవ్వు కలిపారని జగన్మోహన్ రెడ్డి పై విష ప్రయోగం చేయడం దుర్మార్గమని, తక్షణం కొట్లాది మంది ప్రజలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి లడ్డూలో కల్తీ లేదని ఇచ్చిన సిబిఐ నివేదిక ఓ చెంపపెట్టన్నారు.   పూజల అనంతరం ఆలయం వద్ద 101  టెంకాయలు కొట్టారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!