* లడ్డు వివాదంపై వెలువడిన నివేదికలు, రాజకీయ కుట్రలపై కీలక వ్యాఖ్యలు చేసిన - పి. రవీంద్ర నాథ్ రెడ్డి
* తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలన్నీ అపద్దాలు ...
* దేవుడు సత్యం గెలిపించాడు .....
* చంద్రబాబు అబద్ధాలు బద్ధలు.. నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సీబీఐ ...
* కృతజ్ఞతగా తిరుమల తొలిగడప దేవుని కడప వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ ప్రత్యేక పూజలు ...
*చంద్రబాబు మనసు మారాలని టెంకాయలు కొట్టిన వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు....

తిరుమల లడ్డూ వివాదం :
తిరుమల లడ్డు వివాదంపై వెలువడిన నివేదికలు, రాజకీయ కుట్రలపై కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "తిరుమల లడ్డు విషయం"లో నిజం గెలిచిందని, తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలన్నీ అపద్దాలని, దేవుడు సత్యాన్ని గెలిపించాడన్నారు. లడ్డూ విషయంలో కూటమి నేతలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, అబద్ధాలు బద్ధలయ్యాయని, నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ క్లారీటి ఇవ్వడం పట్ల కృతజ్ఞతగా, చంద్రబాబు మనస్సు మారాలంటూ తిరుమల తొలిగడప దేవుని కడప వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం అంజద్_భాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్_బాబు, కడప నగరం మేయర్ పాక సురేష్ లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్‌ఐ (NDRI) కర్నాల్ నివేదిక ప్రకారం, టీటీడీ పంపిన నెయ్యి నమూనాల్లో ఎక్కడా పంది కొవ్వు లేదా ఇతర జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించలేదు.
- " అధర్మాన్ని అణచి, భక్తుల నమ్మకాన్ని కాపాడిన ఆ ఏడుకొండల స్వామి సాక్షిగా నిజం నిలకడ మీద తెలిసింది."
- లడ్డు ప్రసాదంపై జరిగినవన్నీ అసత్య ప్రచారాలేనని సిబిఐ నివేదికతో తేలిపోయింది.
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు.
- శ్రీవారి పవిత్రతను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు అల్లిన అబద్ధాల కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి.
- సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అబద్ధపు ప్రచారాల నుండి భక్తుల నమ్మకాన్ని కాపాడారు.
- గత ప్రభుత్వంపై కావాలనే బురదజల్లారని, ఇప్పుడు నివేదికలతో నిజం బట్టబయలైంది.
- పవిత్రమైన లడ్డుపై లేనిపోని అనుమానాలు రేకెత్తించి భక్తులను ఆందోళనకు గురిచేసి వారి మనోభావాలను దెబ్బతీశారు.
- లడ్డులో పంది కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని సిబిఐ దర్యాప్తులో తేలిపోవడంపై డిప్యూటి సిఎం. పవన్ కళ్యాణ్ దీనికి ఏం సమాధానం చెబుతారు ?
- లేని తప్పును ఉన్నట్టుగా చూపి భక్తులను తప్పుదోవ పట్టించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ?
- సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ చేసినవి కేవలం రాజకీయ డ్రామాలేనని నివేదికలతో స్పష్టమైంది.
- పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.
- నోటికి వచ్చినట్లు మాట్లాడి.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సిబిఐ నివేదికపై ఎందుకు మౌనంగా ఉన్నారు ?
- అబద్ధపు ప్రచారంతో వెంకన్న ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలి.
- మీరు ఎన్ని కుట్రలు చేసినా.. ఆ దైవమే నిజానిజాలను బయటపెట్టారు.
- చివరికి చంద్రబాబు సృష్టించిన ఈ "కొవ్వు" భ్రమలన్నీ వీడిపోయి, శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉందని తేలడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు
- అబద్దాల పునాదులపై విష ప్రచారంతో లబ్ధి పొందాలన్న చంద్రబాబు రచించిన కుట్ర చివరకు కూలిపోయింది, నిజం గెలిచింది, అబద్ధం ఓడింది .
- చంద్రబాబు ఇప్పటికైనా చెంపలు వేసుకుని ప్రజలకు, భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
- చంద్రబాబుకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని,ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం....
