* ఫిబ్రవరిలో శరద్ పవార్ , అజిత్ పవార్ వర్గాల విలీనం గురించి చర్చలు జరగాల్సి ఉండగా....
* సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం కావడం ఆసక్తికరంగా మారిన వైనం....
* విలీనానికి ముందు ఆమెను ఈ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా...
*ఐక్య ఎన్సీపీలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలనే వ్యూహం ...
Maharashtra deputy CM Sunetra Pawar :
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఖాళీ అయిన ఈ పదవిని ఆయన కుటుంబ సభ్యులకే కట్టబెట్టాలని అధికార మహాయుతి కూటమి నిర్ణయించింది.
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయ్యింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు, అజిత్ పవార్ వారసత్వాన్ని కొనసాగించేందుకు సునేత్రా పవార్ సరైన వ్యక్తి అని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భావించారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా పవార్ కుటుంబ పట్టును నిలబెట్టుకోవాలని పార్టీ భావిస్తోంది. అజిత్ పవార్ మరణం పట్ల మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న సానుభూతిని దృష్టిలో ఉంచుకుని, సునేత్రా పవార్‌కు కేబినెట్‌లో కీలక స్థానం కల్పించారని విశ్వసనీయ సమాచారం. ఆమెకు అజిత్ పవార్ గతంలో నిర్వహించిన ఆర్థిక లేక నీటిపారుదల వంటి కీలక శాఖలను కేటాయించే అవకాశం కనిపిస్తొంది. పార్టీలోని సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి వారు కూడా ఆమె నాయకత్వానికి మద్దతు తెలపడం విశేషం. ఇది కేవలం పదవి కట్టబెట్టడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యత కూడా ఆమెపై ఉంటుంది.
ఫిబ్రవరి మధ్యలో శరద్ పవార్ , అజిత్ పవార్ వర్గాల విలీనం గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం కావడం ఆసక్తికరంగా మారింది. విలీనానికి ముందు ఆమెను ఈ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా, ఐక్య ఎన్సీపీలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. శరద్ పవార్ కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం, ఎందుకంటే కుటుంబ సభ్యురాలిగా ఆమెకు ఈ గౌరవం దక్కడం ఆయనకు కూడా సమ్మతమేనని తెలుస్తోంది. సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్ర కేబినెట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, మహిళా ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. బారామతి ప్రాంతంలో ఆమెకు ఉన్న పట్టు పార్టీకి అదనపు బలం కానుంది. శనివారం జరిగే ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు పవార్ కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఈ నియామకం ద్వారా అజిత్ పవార్ వర్గం తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, ప్రభుత్వంలో తన వాటాను పటిష్టం చేసుకుంది.