Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / వాణిజ్యం

పసిడి, వెండి ధరల పరుగులకు బ్రేక్ ....* వెండి ధర రూ.67 వేలు, బంగారం రూ. 15 వేలు తగ్గుదల...

31 Jan 2026
11:47 AM
41

 


వెండి, బంగారం ధరలు నిన్న రికార్డు స్థాయిలో పడిపోగా... నేడూ కూడా అదే ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.  ఫలితంగా బంగారం, వెండి ధరల ధోరణి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో పడిపోయిన ధరలు శనివారం అంతకు మించి పతనాన్ని చవి చూస్తున్నాయి. భారత్‌లో నేడు ట్రేడింగ్ మొదట్లోనే వెండి ధర సగటున రూ.45 వేల మేర పతనం కాగా, మేలిమి బంగారం ధర కూడా రూ.8 వేల మేర పడిపోయింది 

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.8,620 మేర తగ్గి రూ.1,60,058కు చేరింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.7,900 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర మాత్రం మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమైంది. ఏకంగా రూ.55 వేల మేర తగ్గి రూ.3,50,000 లక్షలకు చేరింది.

Article Image

 

 

 

ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,730గా ఉంది. చెన్నైలో రూ.1,62,550 వద్ద, ముంబైలో రూ.1,60,580 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర ఢిల్లీలో రూ.1,47,350 వద్ద కొనసాగుతుండగా, చెన్నై, ముంబైల్లో వరుసగా రూ.1,49,000, రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది. దేశంలో పలు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3.50 లక్షలకు పడిపోయింది. వరుసగా రెండో రోజూ ధరలు ఈ స్థాయిలో తిరోగమనంలో పయనిస్తుండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. స్పాట్ మార్కెట్‌లో రెండు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు. రూ.15 వేల మేర పడిపోగా కిలో వెండి ధర రూ.67 వేల మేర తగ్గింది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!