Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డా ... ఈ కంచుకోట ను బద్దలు కొట్టేవారు లేరు... రారు...● కడప జిల్లా వైసీపీ అద్యక్షుడు రవీంద్రనాథరెడ్డి 

30 Jan 2026
06:19 PM
413

● గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ మోసంతో  ఓటమి చవిచూశాం...
● తిరుమల లడ్డూను స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలని చూశారు ...
● సిట్ చార్జీషీట్ లో అటువంటిది ఏమీ లేదనడంతో ....
● పవన్, బాబు, లోకేష్ లు నోరుమెదపడం లేదు ....
● అయినా ఇప్పుడు కూడా కల్తీ అంటూ ఫ్లెక్సీలు వేయడం దుర్మార్గపు చర్య...

కడప   :

వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి అడ్డా,,, ఈ కంచుకోటను బద్దలుకొట్టేవారు లేరు... రారు. గడచిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ తో ఓటమి చవిచూశాం. ఈ కూటమి పాలన చూసిన ప్రజలే న్యాయ నిర్ణేతలు. సరైన సమయంలో బుద్ధి చెబుతారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు పి, రవీంద్రనాథరెడ్డి అన్నారు. కమలాపురంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అయన కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని,  రాష్ట్రంలో అభివృద్ధి దరిదాపుల్లో లేదని, అరాచకం పాలన నడుస్తోందని,  అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు.

తిరుమల లడ్డూను స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలని చూశారు :
స్వార్థ రాజకీయాల కోసం తిరుమల లడ్డూను కూటమి ప్రభుత్వం  వాడుకుందని,  జగన్మోహన్ రెడ్డి పై వైవి సుబ్బారెడ్డి పై బురద చల్లాలని ప్రయత్నించిందన్నారు.  జంతు కొవ్వులు కలిపి లడ్డు చేసిందని జగన్ పై ప్రచారం చేయడంతో ప్రజలు బాధపడ్డారని,  కోర్టులో సిట్ వేసిన చార్జిషీట్ లో అటువంటిది ఏమీ లేదని చెప్పడంతో నోరు మెదపని  పవన్, బాబు, లోకేష్ లు....తమ కార్యకర్తల ద్వారా ఇప్పుడు కూడా కల్తీ అంటూ ఫ్లెక్సీలు వేయడం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.  తప్పుడు ప్రచారం అని తెలుసుకున్న ప్రజలు.
కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో సమాధి కడతారని చెప్పారు.


కూటమి చేసిన అప్పును కూడా దోచుకు తింటున్నారు :
ఐదేళ్లలో జగన్ చేసిన అప్పు మూడు లక్షల 27 వేల కోట్లు అయితే... కూటమి రెండు ఏళ్లలోపే మూడు లక్షల 12 వేల కోట్లు అప్పుచేసిందన్నారు. కూటమి చేసిన అప్పులో కూడా అరకొర ప్రజలకు ఇచ్చి దోచుకు తింటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని,  రాష్ట్రంలో అభివృద్ధి దరిదాపుల్లో లేకపోగా. అరాచకం పాలన నడుస్తోందన్నారు.  పాలిచ్చే ఆవును మరిచి తన్నె దున్నపోతుని తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు.   అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తుందని,  175 నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేస్తున్న వైసిపి నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నాయకులు  తగిన మూల్యం చెల్లించక తప్పదని,  ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు దోచుకు తినడమే పనిగా పెట్టుకున్నారని, ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా తో కోట్లు దోచుకుంటున్నారన్నారు.  గ్రామ గ్రామాన బెల్టు షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని,  ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా రాష్ట్రం  మారిందన్నారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపికే మెజార్టీ స్థానాలు  :
రాష్ట్రంలో బలిష్టంగా ఉన్న పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పని చేసి 99 శాతం స్థానాలు కైవసం చేసుకుంటుంది.  ఎవరో వచ్చారనో ఏదో పార్టీలో చేరుతారనో పోయే పరిస్థితి నియోజకవర్గం నాయకులకు లేదు.  ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఎన్ని ప్రలోభాలు పెట్టినా, అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా కూడా వేరే పార్టీ వైపు చూడరు.  సోషల్ మీడియాలో వచ్చే అభుత కల్పనలను నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ సీపీ నాయకులకు లేదు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!