ENTRAL BUDGET :
కేంద్ర బడ్జెట్ కు ముందు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల స్వీకరణ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, రూపాయి పతనం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, బడ్జెట్ పై అంచనాలు లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. FIIలు కూడా నిరంతరాయంగా అమ్మకాలు జరుపుతున్నారు. మార్కెట్ లో భయం నెలకొంది.
భారత స్టాక్ మార్కెట్లు గడచిన కొన్ని రోజులుగా నష్టాల్లో నడుస్తుండగా....ఈ రోజు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫలితంగా లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలు జరుపుతున్నారు. నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సర్వే గత ఏడాది ఆర్థిక పనితీరు సమీక్షించి, భవిష్యత్ పాలసీల గురించి చెప్పే నివేదిక. ఇందులో కీలక విషయాలు తెలుస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా షేర్లు అమ్మేస్తున్నారు.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయి 81,707 కి క్షీణించింది. నిఫ్టీ-50 కూడా 0.70 శాతం తగ్గి 25,159కి పడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.70 శాతం వరకు తగ్గాయి. మొదటి గంటలోనే ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లు కోల్పోయారు. BSE మార్కెట్ క్యాప్ రూ. 459.5 లక్షల కోట్ల నుంచి రూ. 456.3 లక్షల కోట్లకు తగ్గింది.
స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై చర్చలు జరపాలని, లేకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ కూడా ఇంతకుముందు ఎన్నడూ లేనంత బలంగా తిరిగి దాడి చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి యుద్ధ భయం వల్ల ఆయిల్ ధరలు పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు దెబ్బతినవచ్చు అనే భయం ఇన్వెస్టర్లలో ఉంది.
రూపాయి అత్యంత కనిష్టానికి :
డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 92కి పడిపోయింది. చరిత్రలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, చమురు ధరలు పెరగడం, రాజకీయ భయాల వల్ల రూపాయి పతనమైంది. రూపాయి బలహీనపడితే FIIలు (విదేశీ ఇన్వెస్టర్లు) మరిన్ని అమ్మకాలు చేసే అవకాశం ఉంది.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం
బ్రెంట్ ఆయిల్ దాదాపు 2 శాతం పెరిగి 70 డాలర్లకు అటు ఇటుగా ఉంది. US-ఇరాన్ టెన్షన్ వల్ల ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ పెద్ద ఆయిల్ ఇంపోర్టర్. ధరలు ఎక్కువగా ఉంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. రూపాయి మరింత తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కంపెనీల లాభాలు తగ్గుతాయి.
బడ్జెట్ 2026 ముందు జాగ్రత్త
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వస్తోంది. ప్రభుత్వం వినియోగాన్ని పెంచేలా పెద్దగా చర్యలు తీసుకోకపోవచ్చు. టాక్స్ మార్పులు లేవని అంచనాలు ఉన్నాయి.
కాబట్టి మార్కెట్‌కు కొత్త పాజిటివ్ ట్రిగర్లు లేవు. బడ్జెట్ పెద్దగా ప్రభావం చూపదు, లాంగ్ టర్మ్‌లో మాత్రమే కొన్ని మార్పులు ఉంటాయి అని ఎంకే గ్లోబల్ తెలిపింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వస్తోంది, కానీ ప్రభుత్వం వినియోగాన్ని పెంచేలా పెద్దగా చర్యలు తీసుకోకపోవచ్చు. టాక్స్ మార్పులు లేవని అంచనాలు ఉన్నాయి, కాబట్టి మార్కెట్‌కు కొత్త పాజిటివ్ ట్రిగర్లు లేవు. బడ్జెట్ పెద్దగా ప్రభావం చూపదు, లాంగ్ టర్మ్‌లో మాత్రమే కొన్ని మార్పులు ఉంటాయన్నది ఆర్ధిక నిపుణుల అంచానా. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది.