DARSI :
తిరుమల లడ్డూపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో జంతువుల కొవ్వు కలపలేదని చెప్పినా టిడిపి బ్యాచ్ మాత్రం నిస్సిగ్గుగా మళ్లీ " మహాపాపానికి ఒడిగట్టింది.
తిరుమల లడ్డూ తయారీలో మహా పాపం నిజమంటూ దర్శిలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కూటమి నేతలు గత కొంత కాలంగా చేసిన తప్పుడు ప్రచారంపై సీబీఐ ఛార్జ్‌షీట్ తో వైసీపీ క్యాడర్, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ తిరుమల లడ్డూలో కల్తీ లేదని సిబిఐ చార్జీషీట్ వేసినా తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి నిజం.. మళ్లీ మహాపాపం నిజమంటూ దర్శిలో ఫ్లైక్సీలు కట్టడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రీవారి భక్తులు అందోళనకు దిగారు. ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం తెలుపుతూ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, శ్రీవారి భక్తులు తొలగించారు. అనంతరం వాటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. 
దీంతో వాటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. అనంతరం వారు అందోళనకు దిగి ఫ్లెక్సీలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు పెట్టిన వారిని వదిలేసి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, శ్రీవారి భక్తులపై దౌర్జన్యం చేసి అరెస్ట్ చెయ్యడం ఎంటని ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తోంది మీరు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులా చంద్రబాబు అంటూ అగ్రహాం వ్యక్తం చేశారు.