* లోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారు ...
* ముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..
* అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసింది
* అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణం ...
* కడప ఎంపి వైఎస్ అవినాష్ ఫైర్
కడప :
డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని, అలాంటప్పుడు మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చెయ్యాల్సిందేనని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. లోకేష్‌తో చర్చకు తామే సిద్ధమని డీఎస్సీ అభ్యర్థులు సవాల్ చేస్తున్నారని, ముందుగా వారికి సమాధానం చెప్పాలని అన్నారు. గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య లోకేష్‌తో చర్చకు సిద్ధమని చెబుతున్నారని, ఆయన విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసి, ఆ తర్వాత సంబంధిత జీవోను రద్దు చేయడం వెనుక కారణాలను స్పష్టం చేయాలని కోరారు. ఎంపిక చేసిన వారు కేవలం ఆటలో పాల్గొనడం మాత్రమే జరిగిందని, వారికి ఎలాంటి మెడల్స్ రాలేదన్నారు. అలాంటి వారికి ద్యోగాలిచ్చి... అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఇచ్చిన వివరణ అయన్ని నవ్వులపాలు చేసిందని విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సీలో అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.
అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పోల్చడం సరికాదని అవినాష్‌రెడ్డి అన్నారు. అదే పార్టకి చెందిన కూన రవి, మంత్రి భరత్ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణమన్నారు. డిఎస్సీ అక్రమాలపై చర్చకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అవసరం లేదని, తమ తరఫున పేర్ని నాని చర్చకు వస్తారని తెలిపారు. లోకేష్‌కు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కోర్టులో ఉన్న అభ్యర్థుల కేసులే లోకేష్‌కు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలని పేర్కొన్నారు. టెట్ సమస్యపై ఉపాధ్యాయులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసినందుకు టీచర్లను వేధించడం సరికాదని అవినాష్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో వారికి అండగా వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.