• డీలిమిటేషన్ బిల్లు వెనక్కి..
• విపక్షాలు ఏకతాటిపైకి రావడం అందరిలో ఆశ్చర్యం....
• మోడి అమిత్ షా కుతంత్రాలను పసిగట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్న విపక్షం...
Delhi :
కేంద్రం ప్రవేశపెట్టిన చరిత్రాత్మక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొనగా... అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. దీంతో 2/3 మెజార్టీ(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.
అయితే మోడీ సర్కారు కావాలని మహిళా రిజర్వేషన్, డెలిమి టేషన్ రెంటిని కలిపి బిల్లు పెట్టి 2/3మెజార్టీ లేకున్నా రాజ్యాంగ సవరణ చేయాలని చూసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు యన్డీఏ అంటే మోడి అమిత్ షా రాజకీయ కుతంత్రాలను పసిగట్టి రాజ్యాంగ సవరణ బిల్లు ను వ్యతిరేకించి
ప్రజాస్వామ్యాన్ని కాపాడారంటూ ప్రతిపక్షం సమర్దించుకుంటుంది.
డీలిమిటేషన్ బిల్లు వెనక్కి.. :
131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు, డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను అమోదింపచేసుకోవడంలో కేంద్రానికి షాక్ తగిలింది. దీంతో డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు ఏకతాటిపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.