Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

BIG BREAKING...ఏపీలో భూకంపం.. ఆ జిల్లాలో ప్రకంపనలు...

19 Feb 2026
08:34 AM
115

గుంటూరు   :

ఏపీలో భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేలుపై ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో భూకంపాలు వచ్చినట్టు తరచూ వార్తలు వస్తుండేవి. కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!