Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

YSRCP నిరసన ర్యాలీల విజయవంతంపై YS జగన్ హర్షం..!

28 Jul 2026
08:33 PM
237


* DSC పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలపై.. 
* Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది ..
* పెద్ద ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శనల వీడియో x లో పోస్టు చేసిన YS జగన్ ..

తాడేపల్లి  : 
ఎపిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ పేపర్ల లీకేజీ, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుపై వైసీపి తలపెట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై వైసీపీ అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన అన్ని జిల్లాలో జరిగిన నిరసనలపై ప్రత్యేకంగా తయారు చేసిన వాడియోను పోస్టు చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని, విద్యార్ధులు, యువకులు  డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వ.. డిఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డ్రైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువ‌త డిమాండ్లను సాధించే క్రమంలో యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!