• రేపు స్టీల్ ప్లాంటు శంకుస్థాపనకు రానున్న చంద్రబాబు...
• ముందు రోజు చోటు చేసుకున్న ఘటన...
కడప :
జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. దేవగుడి గ్రామం ప్రస్తుత బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం కావడంతో పాటు సిఎం చంద్రబాబు స్టీల్ ప్లాంటు శంకుస్థాపనకు జమ్మలమడుగుకు రానున్న నేపధ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల నేపధ్యంలో..అయనపై ఉన్న అభిమానంతో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ఆర్ మరణానంతరం దేవగుడి కుటుంబం వైఎస్ కుటుంబానికి దూరం కావడంతో పాటు టిడిలో చేరిపోయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రతి నిత్యం విమర్శలతో ఒంటికాలిపై లేస్తుంటారు. అలా ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగిన కుటుంబాలు దూమయ్యాయి. పోనీ వైఎస్ కుటుంభానికి దూరమైనా ప్రభుత్వంతోను ఇటీవల సఖ్యతగా లేరు. దీంతో ఇటీవల ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉంటూ...పలు వేదికలపై ప్రభుత్వంపై కూడా ఘాటుగానే విమర్శలు చేశారు.

ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో 3వ తేదీ సిఎం చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంటు శంకుస్థాపనకు రానుండగా... నిన్న వైసీపీ నేతలు వైసీపీ హాయంలో చేసిన శంకుస్థాపన.. చేసిన పనులను వివరించేందుకు స్టీల్ ప్లాంటు సందర్శనకు వెళ్లగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ వైఖరితో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మేమ చేసిన పనులకు ..మేము తెచ్చిన పెట్టుబడులకు కూటమి సర్కార్ క్రెడిట్ చోర్ కు పాల్పడుతుందని విమర్శించారు.
ఈ పరిణామాల నేపధ్యంలో తీవ్ర ప్రిస్టేషన్ లో ఉన్న ఆదినారాయణ రెడ్డి నిన్న సాయంత్రం వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని చెప్పుతో కొడతానంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా వైఎస్ జగన్ నా వెంట్రుక కూడా పెరుక్కోలేకపోయారని, రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుందన్నది మర్చపోవద్దని ఘాటుగా హెచ్చరించారు. ఈ పరిణామాలు జరిగిన మరుసటి రోజే దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డినే విగ్రహాన్ని ధ్వంసం చేయించారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను ఖండిస్తూ జమ్మలమడుగులోని ఆ పార్టీ కార్యాలయం నుంచి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, ఎంపి వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.