* నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.... టీవీకే డిమాండ్
Astranews :
ఢిల్లీలో నీట్ (NEET) పరీక్ష లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి మద్దతు ప్రకటించారు. రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకుల అరెస్టును ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.
రాహుల్, ఇతర ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం అప్రజాస్వామికమని ట్వీట్ చేశారు. 'ప్రతిపక్ష పార్టీల నిరసనలకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. నీట్ పరీక్ష విద్యార్థులను, వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. NEETను రద్దు చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తప్పుడు హామీలు ఇవ్వకూడదు' అని విమర్శించారు. వైద్య విద్యను కేంద్రం పరిధి నుంచి రాష్ట్రాల జాబితాకు మార్చడమే దీనికి సరైన పరిష్కారం అని ఆయన తెలిపారు. ఇందుకు న్యాయపరంగా ఏవైనా అడ్డంకులుంటే వాటిని తొలగించే వరకు తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని విజయ్ సూచించారు.