Tuesday, 27 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / క్రీడలు

రెండో T20కి ముందు టీమిండియాకు సెలక్షన్ తలనొప్పి ...!

09 Oct 2026
08:14 AM
10

సంజూ శ్యామ్సన్‌ను తప్పిస్తారా? 

సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా?

Astranews sports desk : 

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2-0 ఆధిక్యం కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అయితే రెండో T20కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందు పెద్ద సెలక్షన్ సమస్య వచ్చి పడింది. ఓపెనర్లు సంజు శాంసన్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై మేనేజ్‌మెంట్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఫామ్ కోల్పోయిన శాంసన్: కేరళ బ్యాటర్ సంజు శాంసన్ తీవ్రంగా విఫలమవుతున్నాడు. చివరి 4 ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు వరుసగా 9, 7, 2, 11 పరుగులు మాత్రమే. భాగస్వామ్యాలు కూడా 7, 12, 2, 29 పరుగులకే పరిమితమయ్యాయి. జట్టులో మిగతా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో ఈ వైఫల్యాలు బయటపడలేదు.

కెప్టెన్ అయ్యర్ సెంచరీతో జోష్ :

మొదటి T20లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన తొలి అంతర్జాతీయ T20 సెంచరీతో చెలరేగాడు. దీంతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది.

15 ఏళ్ల సూర్యవంశీకి అవకాశమా?.....: అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ వైభవ్ సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడు. తనదైన షాట్లతో, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గతంలో జపాన్ ఆసియన్ గేమ్స్‌లో సూర్యవంశీకి ఓపెనింగ్ ఇచ్చి, శాంసన్‌ను 3వ స్థానంలో ఆడించారు. కానీ శాంసన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

అయితే సూర్యవంశీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో తడబడుతున్నాడు. ఇంగ్లండ్‌తో 0-3 తేడాతో ఓడిన సిరీస్‌లో 14, 13, 15 పరుగులు, ఆసియన్ గేమ్స్‌లో 18, 35 పరుగులు మాత్రమే చేశాడు. చిన్న వయసు కావడంతో అతడిని తొందరపెట్టడం సరికాదని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.

బౌలింగ్‌లో మార్పులు?మొదటి T20లో మయాంక్ యాదవ్ తొలి ఓవర్‌లోనే 16 పరుగులు ఇచ్చి ఖరీదయ్యాడు. అయితే చివరి ఓవర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను ఔట్ చేశాడు. అతని స్థానంలో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

స్పిన్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్ 3/31తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ షాయ్ హోప్, హెట్మయర్, పావెల్, చేజ్, షెపర్డ్‌లపై భారీ బాధ్యత ఉంది. బుమ్రా లేకపోవడంతో 220 పైగా స్కోర్ చేస్తేనే విండీస్‌కు అవకాశం ఉంటుంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!