Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలో LPG ఏటీఎంలు...!

22 Mar 2026
06:35 PM
53

• గురుగ్రామ్ లో దేశంలోనే ఫస్ట్ LPG ఏటీఎం.. .. 
• పైలెట్ ప్రాజెక్టుగా తొలి LPG ఏటీఎం...!

LPG ATM :

దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం గురుగ్రామ్లో ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ LPG ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఎల్పీజీ వెండింగ్ మెషీన్ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది. తద్వారా ప్రజలు కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు.
దీంతో ఇక గ్యాస్ సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన పని లేదు. ఎల్పీజీ ఏటీఎంతో ఇన్స్టంట్ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. కొత్త యుగంలో గ్యాస్ కోసం ఏటీఎంకు వెళ్లే రోజులు రానే వచ్చేశాయి.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వంటగ్యాస్ సంక్షోభం తలెత్తింది. భారత్ ఎల్పీజి అవసరాలలో సుమారు 60శాతం దిగుమతి చేసుకుంటుండగా...ఈ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి.

గ్యాస్ రవాణాలో జాప్యం, భయాందోళనలతో కొనుగోళ్లు చేయడం వల్ల గ్యాస్ సిలిండర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం గురుగ్రామ్ లో ప్రారంభమైంది. ఈ ఎల్పీజీ వెండింగ్ మెషిన్ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది.

బీపీసీఎల్ ఎల్పీజీ ఏటీఎం ఏర్పాటు :
గురుగ్రామ్ లోని సోహ్నా, సెక్టార్ 33లో సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో భారత్ పెట్రోలియం (BPCL) ఈ స్మార్ట్ LPG వెండింగ్ మెషీన్ను ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. మీరు కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు. గ్యాస్ వస్తుందో రాదో అనే టెన్షన్ ఇక ఉండదు. డెలివరీ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఈ మెషీన్ ఎలాంటి ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లు లేదా డెలివరీ విండో లేకుండానే సిలిండర్ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈజీ డిజిటల్ ప్రాసెస్ పూర్తి చేయడమే. భారత్ గ్యాస్ ఇన్స్టా ఎల్ పీజీ పేరుతో ఈ LPG ATM అధికారికంగా రెండు నెలల క్రితమే ప్రవేశపెట్టింది. కానీ, ఇప్పుడు సాధారణ ప్రజల కోసం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎం మెషీన్ రోజంతా అంటే 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏజెన్సీ మీకు కొత్త తేలికైన కాంపోజిట్ సిలిండర్ను ఇస్తుంది. మీరు ఎల్పీజి ఏటీఎమ్ కు వెళ్లి 2 నిమిషాల్లో రీఫిల్ చేయించుకోవచ్చు. కాంపోజిట్ సిలిండర్ల ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. 14.2 కేజీల ఐరన్ సిలిండర్ ధర సుమారు రూ.1450 ఉండగా, కాంపోజిట్ సిలిండర్ ధర సుమారు రూ. 3350 ఉంటుంది.

Article Image 

LPG ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుందంటే ? :
ముందుగా, మెషిన్ స్క్రీన్పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు వచ్చిన OTPని ఎంటర్ చేసి మీ ఐడెంటిటీని వెరిఫై చేయండి. మీ ఖాళీ సిలిండర్పై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ను మెషిన్ స్కానర్ ముందు ఉంచండి. ఆ సిలిండర్ వ్యాలీడ్ అవుతుందో లేదో మెషిన్ చెక్ చేస్తుంది. వెరిఫికేషన్ సక్సెస్ తర్వాత విండో ఓపెన్ అవుతుంది. మీ ఖాళీ సిలిండర్ను స్లాట్లో ఉంచాలి. మిషన్ దానంతట అదే స్వచ్ఛత, బరువును చెక్ చేసి వెంటనే సిలిండర్ లోపలికి పంపుతుంది. మీరు స్క్రీన్ పై కనిపించే గ్యాస్ ధర ఎంత ఉందో యూపీఐ ద్వారా చెల్లించాలి. పేమెంట్ సక్సెస్ అయితే మిషన్ డెలివరీ విండో నుంచి సీల్ చేసి నింపిన సిలిండర్ బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది.

కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలివే :
మీకు ఐరన్ సిలిండర్ల కన్నా వెయిట్ లెస్ 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లు లభిస్తాయి. ఏటీఎం మిషన్లో ఒకేసారి 10 సిలిండర్లను మాత్రమే లోడ్ చేయవచ్చు. ఒకవేళ స్టోరేజీలో కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉంటే మిషన్ రీఫిల్ కోసం సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి అలర్ట్ పంపుతుంది.

కాంపోజిట్ సిలిండర్గా ఎలా మార్చుకోవాలంటే ? :
14.2 కేజీల ఐరన్ గ్యాస్ సిలిండర్ డాక్యుమెంట్లు (పాస్బుక్) భారత్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లండి. మీ పాత ఐరన్ సిలిండర్లకు బదులుగా 10 కేజీల కాంపోజిట్ సిలిండర్ మార్చమని అడగండి. మీరు పాత సిలిండర్ సుమారు రూ. 1,450 సెక్యూరిటీ డిపాజిట్, కొత్త కాంపోజిట్ సిలిండర్ సుమారు రూ.3,350 సెక్యూరిటీ డిపాజిట్ మధ్య సుమారు రూ.1,990 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతే క్యూలో నిలబడకుండానే నిమిషాల వ్యవధిలో సిలిండర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!