* మెగా స్కామ్ కోసం జాగ్రత్తగా రూపొందించిన స్కెచ్ "మెగా DSC".
* చంద్రబాబు, లోకేష్ చేసిన డార్క్ ఆపరేషన్ ఇది...
* చంద్రబాబు సర్కారు తీరుతో లక్షల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
* 16వేల DSC పోస్టుల కోసం పారదర్శకతకు పాతరేశారు - వైఎస్ జగన్ ..
ASTRA NEWS THADEPALLI :
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా డిఎస్సీపై సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర అరోపణలు చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ లు కలిసి ఓ మెగా స్కామ్క రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ ఎక్స్రే ఇలా ట్వీట్ చేశారు. ఏపీలో 16,000 టీవర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్లు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.
అలాగే అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔస్నోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక విస్పోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాండ్ సాధించడం "పేవర్ చీరకు స్పష్టమైన సంగీతం" అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.
మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిండని జగన్ ఆవేదన వీక్లీర్ణం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం "వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం" అని వ్యాఖ్యానించాడు.
క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరపిలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా "బ్యాడ్ల్లోడోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం" జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీవర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.
ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను "దశలవారీగా జరిగిన బడా స్కామ్'గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమగ్గార్హం.