గుంటూరు :
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సత్తనపల్లెలో 2023లో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ వచ్చినా పోలీసులు పాత కేసుల పేరుతో పీటీ వారెంట్లు జారీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం బెయిల్ వచ్చిన కేసులోను కష్టడీకి ఇవ్వాలంటూ పోలీస్ కస్టడీ పిటిషన్ వేయగా, కోర్టు న్యాయమూర్తి మేరీ సరధమ్మ డిస్మిస్ చేసి బెయిల్ మంజూరు చేసింది. తిరుమల లడ్డూ కల్తీ కి సంబంధించి జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి గత నెల 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.