దిల్లీ :
లోక్‌సభలో మోదీపై దాడికి యత్నం అలస్యంగా వెలుగులొకి వచ్చింది. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కీలక కారణం ఉందని వార్తలు వస్తున్నాయి. సభలోనే మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే నిన్న సభను స్పీకర్ వాయిదా వేసినట్లు వెల్లడించాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడవలసి ఉన్న ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 8 మంది విపక్ష ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేయడం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి చెందిన అముద్రిత పుస్తకం నుంచి చైనాకు సంబంధించిన కొన్ని అంశాలను ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం లోక్‌సభలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. సభలోనే మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే నిన్న సభను స్పీకర్ వాయిదా వేసినట్లు వెల్లడించాయి.
అయితే ఆయన రాజ్యసభలో తన ప్రసంగాన్ని చేయనున్నారు. రాజ్యసభలో పెద్దగా ఆందోళనలు జరగడం లేదు కాబట్టి .. ఎగువ సభలో ప్రధాని తన ధన్యవాద తీర్మానాన్ని తెలిపే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే రోజు రెండు సభల్లోనూ ధన్యవాద తీర్మానాన్ని పాస్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.