Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

“48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే" ...!

22 Mar 2026
08:36 PM
57

• ఇరాన్ పవర్ ప్లాంట్లు కనుమరుగే...
• ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం

వాషింగ్టన్   :

హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు.
తమ దాడులు ఇరాన్‌లోని అతిపెద్ద ఇంధన ప్లాంట్ నుండే మొదట ప్రారంభమవుతాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, అయితే తనకు అటువంటి ఉద్దేశ్యం లేదన్నారు ట్రంప్. కానీ ఇప్పటికే ఇరాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేశామని, ఆ దేశ నాయకులు, నావికాదళం, వాయుసేన అంతమయ్యాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని ఖండించిన జి-7 (G-7) దేశాలు  : 
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేయడాన్ని జి-7 దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు తాము ఏ చర్యకైనా సిద్ధమని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు హోర్ముజ్ జలసంధి భద్రతకు పూర్తి మద్దతు ఇస్తామని సభ్యదేశాలు స్పష్టం చేశాయి.

దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యాం  ఇజ్రాయెల్ స్పందన: 
ఇరాన్ జరిపిన దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఇదొక క్లిష్టమైన సమయమని, శత్రువులను అన్ని రంగాల్లోనూ ఎదుర్కోవడం కొనసాగిస్తామన్నారు. మరోవైపు, ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అంగీకరించారు. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో పాఠశాలలను కూడా మూసివేశారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!