- 'ఈ రోజు ఒక నాగరికత అంతానికి.. 47 ఏళ్ల సామ్రాజ్యానికి ముగింపు' ...
* ఇరాన్ పై ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్...
* ఇప్పటికే సంయమనం పాటించమంటూ ఐఆర్‌జీసీ కౌంటర్...
* ఇరువురి ప్రకటనతో ఏం జరగబోతోందంటూ ప్రపంచమంతట టెన్షన్ ... - * మానవాహారాలుగా రొడ్లెక్కిన ఇరాన్ ప్రజలు ...
ఇంటర్నెట్ డెస్క్ :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. మొత్తం నాగరికత అంతరించిపోవడం గురించి పోస్టులో ఆయన రాశారు. "ఈరోజు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇక ఎప్పటికీ కనిపించదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ, అదే జరగొచ్చు" అంటూ ట్రంప్ రాశారు.

"అయితే, ప్రస్తుతం పూర్తిస్థాయిలో పాలన మార్పు జరిగింది కాబట్టి.. విభిన్నమైన, మరింత వివేకవంతులైన, మూర్ఖపు పట్టుదల లేని ఆలోచనాపరులు ముందుకొచ్చారు కాబట్టి.. బహుశా అనూహ్యంగా ఏదైనా జరగొచ్చు, ఎవరికి తెలుసు?" . "ఏం జరుగుతుందో ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ ప్రపంచపు సుదీర్ఘ, సంక్లిష్టమైన చరిత్రలో నమోదైన అత్యంత కీలక ఘట్టాలలో ఇదొకటి.". మంగళవారం రాత్రికల్లా 'ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది' అంటూ ఇరాన్‌ను సూటిగా హెచ్చరించారు. "అవును, అదే జరుగుతుంది. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, చావుల కథ ముగిసిపోనుంది. ఇరాన్ ప్రజలను దేవుడు రక్షించుగాక" అని ట్రంప్ రాశారు. హార్ముజ్ విషయంలో ఒక ఒప్పందానికి వచ్చేందుకు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్ ఇరాన్‌కు గడువిచ్చారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటల వరకు గడువు ఉంది. అయితే, ఇప్పటివరకూ ఇరాన్ ఎలాంటి ఒప్పందానికీ రాలేదు. మరోవైపు, ఇప్పటి వరకూ తాము సంయమనం పాటించామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఐఆర్‌జీసీ ప్రకటనలో ఏముంది ? ...
ట్రంప్ ప్రకటనకు ఇరాన్ నుంచి నేరుగా స్పందన రాకపోయినప్పటికీ, అమెరికా సహా ఈ ప్రాంతంలోని దాని మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు సంబంధించి ఇప్పటివరకూ చాలా సంయమనం పాటించామని, "లక్ష్యాలను ఎంచుకుని సిద్ధంగా ఉన్నామని ఐఆర్‌జీసీ తాజా ప్రకటనలో పేర్కొంది. ఇక అన్నీ పక్కకు పోతాయని ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా బలగాలు కనుక "రెడ్‌లైన్ దాటితే" తమ ప్రతిఘటన కేవలం ఈ ప్రాంతానికే కాదని, మరింత విస్తరిస్తుందని కూడా ఐఆర్‌జీసీ తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, ఫలితంగా ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ సరఫరాకు చాలా ఏళ్లపాటు అంతరాయం కలగొచ్చని కూడా హెచ్చరించింది.
ట్రంప్ ప్రకటనతో అందరిలో ఉత్కంఠ .. :
మొత్తం నాగరికత అంతరించిపోవడం గురించి పోస్టులో ఆయన రాశారు. "ఈరోజు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇక ఎప్పటికీ కనిపించదు అంటూ ట్రంప్ చేసిన పోస్టుతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠతతో ఎదురుచూస్తొంది. ఈ రాత్రికి ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతుంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్దం వల్ల ప్రపంచ దేశాల్లో గ్యాస్ కోరత, ఇంధన కోరత సంక్షోభం అందరికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపధ్యంలో ట్రంప్ చేసిన ప్రకటన... ప్రతిగా ఐఆర్‌జీసీ తాజా ప్రకటనతో పశ్చిమాసియాలోను, అమెరికా మిత్రదేశాల్లో ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

మానవాహారాలుగా ఇరాన్ ప్రజలు ... :
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇరాన్ యువజన క్రీడల శాఖ ఉప మంత్రి అలీరెజా రహీమీ తన దేశ ప్రజలకు ఒక ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు. అమెరికా బాంబు దాడుల నుంచి తమ విద్యుత్ కేంద్రాలను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువకులు, కళాకారులు, క్రీడాకారులు రేపు మధ్యాహ్నం ఆయా ప్లాంట్ల వద్ద ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మానవ హారాలు కట్టాలని కోరారు. ప్రజా మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం అని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని రహీమీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పిలుపు మేరకు విద్యుత్ ప్లాంట్ల వద్ద, భారీ వంతెన వద్ద దేశ ప్రజలు చేరి మానవ హారాలు కడుతున్నారు.