-సిఎం చంద్రబాబుపై కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి ఫైర్ ...
-సీమ సాగు, తాగు నీటి కోసం ఏనాడు ఒక మాట మాట్లాడలేదు ...
-రాయలసీమకు ఎదైనా చేశారంటే అది వైఎస్ఆర్, వైఎస్ జగన్ లు మాత్రమే ...
కడప :
చంద్రబాబునాయుడు నాగులు సార్లు సిఎం కావడమే రాయలసీమకు దౌర్బాగ్యమని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడప నగరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే లక్ష్యంగా గ్రేటర్ రాయలసీమ నేతలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షత వహిస్తూ మాట్లాడిన రవీంద్రనాథరెడ్డి ... చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాయలసీమ జన్మనిచ్చిందే కానీ అయనకు రాయలసీమ పట్ల ఏనాడు ప్రేమలేదన్నారు. చంద్రబాబుకు రాయలసీమ పట్ల సొంత ప్రాంతమనే అభిమానం కూడా లేదని, పుట్టిన ప్రాంతం రుణం తీర్చుకోవాలని, మంచి చెయ్యాలనే ఉద్దేశం అపలే లేకపోవడం వల్లే రాయలసీమకు చంద్రబాబు మంచి చెయ్యలేదన్నారు. గతంలో రాయలసీమ సాగు, తాగు నీటి సాథన కోసం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి,మాజీ హొం మంత్రి మైసూరారెడ్డి, ఇతర నేతలు పాదయాత్రలు, ఉద్యమాలు చేస్తే చంద్రబాబు మాత్రం ఏనాడు పాల్గొనలేదన్నారు. ఉద్యమాల్లో పాల్గొనకపోయినా కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. మొదటి నుంచి రాయలసీమ పట్ల చిన్నచూపు చూస్తూనే వస్తున్నారని, పచ్చి రాజకీయ అవకాశవాదిగా గెలుపొందుతూ వచ్చారే కానీ రాయలసీమకు మంచి చేసి గెలివలేదన్నారు. రాయలసీమ సాగు, తాగు నీటి కోసం ఎదైనా చేశారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహాన్ రెడ్డిలు మాత్రమేనన్నారు. భవిష్యత్తు తరాలు బాగులంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పక సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని, ఇందులో ప్రజలను, కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములుగా చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు. చంద్రబాబు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చెయ్యకపోతే ప్రజలు కూడా అయనను క్షమించరన్నారు.