
ప్రొద్దుటూరు :
క్యాన్సర్ పై అవగాహన పెంచుతూ ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో నెల్లూరు మెడికవల్ హాస్పిటల్ 2k రన్ నిర్వహించారు. ఎస్ కె వి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ని గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ వరకు భారీగా ర్యాలీ సాగింది. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు ఆధ్వర్యంలో క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. మెడికవర్ సీనియర్ కన్సల్టెంట్ అంకలజిస్ట్ డా.జి. రంగ రమన్ మాట్లాడుతూ, భారత్ లో ప్రతి సంవత్సరానికి 14 లక్షల కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని వీటిలో అధిక శాతం ఆలస్యంగా గుర్తించడం వలన ప్రాణాపాయం జరుగుతుందన్నారు. అయితే సమయానికి పరీక్షలు చేసుకుంటే ప్రారంభ దశలోనే క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆధునిక కిమోధెరపి, టార్గెటెడ్ ధేరపి, ఇమ్యునో థెరపీ వంటి చికిత్సలతో క్యాన్సర్ ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయని, ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన వారు బ్రెస్ట్, ఓరల్ సర్వైకల్ క్యాన్సర్ స్కిన్నింగ్ను తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ పవన్, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ కాల్వ విజయ్ నాగేంద్ర, డాక్టర్ సమిత, ఎస్ కె వి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ హరినారాయణ పాల్గొన్నారు..