- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు..
- గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన వారు..
- ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకునే వారికి అహ్వానం..
- Astranews desk :
జనసేన పార్టీ ఈ నెల 28వ తేదీ సాయంత్రం 4 గ.లకు మంగళగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ నుంచి బాధ్యతల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, 2021 స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పార్టీ తరఫున పోటీ చేసినవారు పాల్గొంటారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అనేక అడ్డంకులను, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా,జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వందలమంది జనసేన నుంచి పోటీ చేశారు. ఆత్మీయ సమావేశంలో వీరిని భాగస్వాములను చేశారు.
అంతేకాకుండా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా - స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ అందించిన మార్గదర్శకాలు, సూచనలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తారు. అదే రోజు - స్థానిక ఎన్నికల విధివిధానాల కోసం 14 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ సమావేశం ఉంటుంది.