ఫలించిన వైసీపీ ఐదు రోజుల పోరాటం....
26న హైరిటేజ్ - ఇందాపూర్ డెయిరీపై మండలిలో చర్చించేందుకు నిర్ణయం...
అమరావతి :
కల్తీ లడ్డు, హైరిటేజ్ - ఇందాపూర్ డెయిరీపై చర్చించాలంటూ మండలిలో ఐదు రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ అంశంపై ఈ నెల 26న మండలిలో చర్చించాలని మండలి చైర్మన్ మోషేన్‌రాజు నిర్ణయించారు. శాంతిభద్రతలు, ఇరిగేషన్ శాఖలపై వరుసగా మండలిలో చర్చించనుండగా, ఇదే సందర్భంలో 26న ఇందాపూర్ డెయిరీపై మండలిలో చర్చించేందుకు నిర్ణయించారు.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై చర్చించాలని నాలుగు రోజులుగా మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు చర్చించాలంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వడం తిరష్కరణకు గురి కావడం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ కూడా వైసీపీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఈ అంశం సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ తన ఉత్పత్తి యూనిగ్గా ఇందాపూర్ డెయిరీని సొంత వెబ్సైట్లోనే పేర్కొంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఈ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వస్తుండడాన్ని వైసీపీ సభ్యులు గుర్తు చేస్తూ వచ్చారు.
మరోవైపు అతి తక్కువ ధరకు ఈ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని, కల్తీ జరిగిందనే కోణంలో వైసీపీ సభ్యులు అరోపిస్తున్నారు. సీఎం కుటుంబ సభ్యుల సారథ్యంలో నడుస్తున్న కంపెనీ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతోంది. షేర్ల ధర కూడా పతనమయ్యాయి. దీంతో ఆ వివాదం కొనసాగితే మరింత నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళనతో పాటు ప్రతిపక్షం మండలిలో చర్చకు పట్టుబడుతుంటే అధికార పక్షం పారిపోతుందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందన్న భయం కూడా పాలకుల్లో కనిపిస్తోంది. అందుకే ఐదు రోజులుగా వైసీపీ పట్టు పడుతున్నా, ప్రభుత్వ వైపు నుంచి చర్చకు సంబంధించి సానుకూల ప్రకటన రాలేదు.
ఇవాళ కూడా మండలిలో అదే పరంపర కొనసాగడంతో మండలి చైర్మన్ ఇరు పక్షాలతో మాట్లాడారు. చివరికి 26న మండలిలో ఇందాపూర్ డెయిరీపై చర్చకు అంగీకరించారు. 
ఇందాపూర్ డెయిరీపై చర్చ తీవ్ర వాడివేడీగా సాగే అవకాశం :
ఇందాపూర్ డెయిరీపై చర్చ తీవ్ర వాడివేడీగా సాగే అవకాశం ఉంది. అసలే తమ వద్ద అన్ని అధారాలున్నాయంటూ వైసీపీ మంచి ఊపు మీద ఉంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి మండలిని వేడెక్కిస్తొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షర పనులకు ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్న కసితో అధికార పక్ష్యం కూడా చర్చకు సిద్ధమైంది. దీంతో ఇందాపూర్ డైరీ పై మండలి లో జరిగే చర్చ తీవ్రవాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తుంది.
అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు చెబుతామంటున్న అధికార పక్ష్యం :
హెరిటేజ్ ఇందాపూర్ డైరీ వ్యవహారంపై 26వ తేదీ మండలిలో చర్చ జరగనుండగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడిగా వాదోపవాదాలు సాగుతాయన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. అయితే మండలిలో చర్చ జరిగితే అధికార పక్షం మాత్రం అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు చెబుతామని ప్రభుత్వ ముఖ్యులు చెప్పడం గమనార్హం. అంటే మండలిలో అధికార పక్షం ఏం చెప్పినా ప్రతిపక్షం నుంచి కౌంటర్ వేసే పరిస్థితి ఉండడంతో ... తాము చెప్పదల్చుకున్నది అసెంబ్లీ వేదికగా అధికారపాక్షం చెప్పాలనుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రాకపోవడం, ఇక్కడ స్పీకర్ అధికార పక్ష్యానికి అనుకూలంగా ఉంటుండటం మనం చేస్తున్నాం. ఒక వేల మండలిలో వాదోపవాదాలు సాగిన అసెంబ్లీలో మాత్రం తమ తప్పేమీ లేదు ...కల్తీ జరిగింది వైసిపి హాయంలోనే అన్న మాటలు చెప్పేసే చేతులు దులిపేసుకున్నందుకు అధికార పక్షం అసెంబ్లీ వేదికగా వాస్తవాలు చెబుతామని చెబుతుందా అన్న ప్రశ్నలు కూడా లేకపోలేదు.
అసెంబ్లీ లాబీలో లోకేష్ మీడియాతో చిట్ చాట్ :
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టుపెట్టి పిలవరని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కామెంట్ చేశారు. సభకు రావటం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తుచేశారు. దేవుడిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకు తీసుకురావవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమన్నారు.