Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ .. 2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు.. రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు.. మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు.. రెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు.. ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు...

14 Feb 2026
01:57 PM
49


అమరావతి, ఫిబ్రవరి 14: 

ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ యేడాది రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయగా... 11.75 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27వ ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు.  

Article Image

బడ్జెట్‌ స్వరూపం..

2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు

మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు

రెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు

ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు

 

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపు వివరాలు ఇలా:

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు

రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు

వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు

పరిశ్రమలకు రూ.3,161 కోట్లు

సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు

జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు

మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు

అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు

పోలవరం – రూ.6,105 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు

ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు

మత్స్యకార సేవలో – రూ.260కోట్లు

పంటల బీమా – రూ.250 కోట్లు

పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు

సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:

ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు

దీపం 2.0 - రూ.2,601 కోట్లు

వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు

స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు

వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు

ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు

తల్లికి వందనం – రూ.9,668 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు

ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు

సమగ్ర శిక్ష – రూ.2,946 కోట్లు

ఉన్నత విద్య – రూ.2,566 కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు

మన బడి, మన భవిష్యత్ – రూ.1,500 కోట్లు

నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు

పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర – రూ.654 కోట్లు

యువత, క్రీడలు – రూ.438 కోట్లు


శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపు :

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖకు రూ.22,942 కోట్లు

మున్సిపల్ శాఖకు రూ.14,539 కోట్లు

జల వనరుల శాఖ రూ.18, 224 కోట్లు

పాఠశాల విద్యాశాఖ- రూ.32,308 కోట్లు

ఇంధన శాఖకు రూ.13,934 కోట్లు

సాంఘిక సంక్షేమ శాఖకు రూ.11,118 కోట్లు

కార్మిక శాఖకు రూ.735 కోట్లు

గృహ నిర్మాణ శాఖకు రూ.6357 కోట్లు

R&B శాఖకు రూ.9,856 కోట్లు

హోం శాఖకు రూ.9,165


ఇతర కేటాయింపులు  :

పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు

కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు

జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు

9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు

ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

అన్నదాత సుఖీభవకు రూ.6,660 కోట్లు

పోలవరంకు రూ.6,105 కోట్లు

హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు

 

 


 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!