Budget Session 2026 :
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది తొమ్మిసారి. అయితే స్వాతంత్య్ర భారతదేశంలో ఆదివారం రోజున పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కూడా. భారత కేంద్ర బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 29న పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2026ను సమర్పించారు. స్థిరమైన స్థూల ఆర్థిక పునాదులు, కొనసాగుతున్న సంస్కరణల మద్దతుతో, 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2025-26 తో పోలిస్తే కోర్ మరియు హెడ్ లైన్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ... అది ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ముప్పు కలిగించే అవకాశం లేదని సర్వే పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఈ బడ్జెట్ లో సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు , బీడీలు, బ్యాటరీలు, సీఎన్‌జీ, బయోగ్యాస్, క్యాన్సర్, షుగర్ మందుల ధరలు ధరలు తగ్గనున్నాయి.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా ... :
* ట్రాన్స్‌పోర్ట్ - రూ. 5,98,520 కోట్లు
* డిఫెన్స్ - రూ. 5,94,585 కోట్లు
* రూరల్ డెవలప్‌మెంట్ - రూ. 2,73,108 కోట్లు
* హోం అఫైర్స్ - రూ. 2,55,234 కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ. 1,62,671 కోట్లు
* విద్యా రంగం - రూ. 1,39,289 కోట్లు
* ఎనర్జీ సెక్టార్ - రూ. 1,09,029 కోట్లు
* వైద్యారోగ్య రంగం - రూ. 1,04,599 కోట్లు
* అర్బన్ డెవలప్‌మెంట్ - రూ. 85,522 కోట్లు
* ఐటీ, టెలికాం - రూ. 74,560 కోట్లు
* కామర్స్ అండ్ ఇండస్ట్రీ - రూ. 70,296 కోట్లు
* సోషల్ వెల్ఫేర్ - రూ. 62,362 కోట్లు
* సైంటిఫిక్ డిపార్ట్‌మెంట్స్ - రూ. 55,756 కోట్లు
* ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ - రూ. 45,500 కోట్లు
* విదేశీ వ్యవహరాలు - రూ. 22,119 కోట్లు
* ఆర్థిక రంగం - రూ. 20,649 కోట్లు
* ఈశాన్య ప్రాంత అభివృద్ది - రూ. 6,812 కోట్లు
బడ్జెట్‌లో ధరలు తగ్గేవి.. :
* సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
* బీడీలు, బ్యాటరీలపై ధరలు తగ్గనున్నాయి.
* సీఎన్‌జీ, బయోగ్యాస్ ధరలు తగ్గనున్నాయి.
* క్యాన్సర్, షుగర్ మందుల ధరలు తగ్గనున్నాయి.
* షూస్, దుస్తుల ఎగుమతి
* తీవ్రమైన వ్యాధులకు మందులు
* మత్స్యకారులకు ఎగుమతులు చౌకగా ఉంటాయి.
* విమాన పరికరాల ధరలు
* విదేశాల్లో చదువుకోవడం, విదేశీ ప్రయాణం ధరలు తగ్గనున్నాయి. చదువులు, వైద్యంపై TCS 5% నుంచి 2% తగ్గించారు.
పెరగనున్న ధరలు ఇవే.. :
* ఫార్వర్డ్ ట్రేడింగ్
* ఖనిజాలు
* స్క్రాప్
* మద్యం, సిగరేట్లు
క్యాన్సర్ రోగులకు ఊరట :
క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌తో ఉపశమనం కల్పించింది కేంద్రం. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్ 1 నుంచి క్యాన్సర్ మందులపై ఎంఏటీ పన్నులో మినహాయింపులు ఇచ్చారు. పన్నును 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.