టీ20 ప్రపంచకప్ :
టీ20 ప్రపంచకప్ పోరులో ఇండియాకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ స్పిన్ ట్రాప్ సెట్ చేసింది. స్పిన్నర్లకు కోపరేట్ చేసిన పిచ్ పై పాక్ ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. అయితే ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్, ఆఖర్లో మెరుపులతో ఇండియా స్కోరు 170 దాటింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఇండియా మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఒక్కడే అదరగొట్టాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.
రెండో మ్యాచ్ ోను అభిషేక్ డకౌట్ :
ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌటయ్యాడు. వరుసగా అతను ఆడిన రెండో మ్యాచ్ లోనూ సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. స్పిన్ తో అభిషేక్ కు బ్రేక్ వేద్దామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్వయంగా బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు.
ఇషాన్ తుపాన్ :
అభిషేక్ శర్మ వికెట్ పడగొట్టిన ఆనందం పాకిస్థాన్ కు ఎక్కువ సేపు ఉంచకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తుపాను స్టేడియాన్ని ముంచెత్తింది. పాకిస్థాన్ స్పిన్నర్లతోనే బౌలింగ్ ఎటాక్ కొనసాగించినా ఇషాన్ కిషన్ ఏ మాత్రం తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
ఇషాన్ ఓ వైపు చెలరేగగా.. మరో ఎండ్ లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (24 బంతుల్లో 25) స్పీడ్ గా ఆడలేకపోయాడు. అయినా ఇండియా టీమ్ 8.3 ఓవర్లలో 88 పరుగులతో బెటర్ గానే నిలిచింది. కానీ ఆ తర్వాతి బంతికే ఇషాన్ ను సయీం అయూబ్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 32) కూడా నెమ్మదిగానే ఆడటంతో స్కోరుబోర్డుకు బ్రేక్ పడింది.
ఒకే ఓవర్లో రెండు :
ఇక ఇండియా బ్యాటర్లు చెలరేగాల్సిన టైమ్ లో సయీం ఒకే ఓవర్లో వరుస బంతుల్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (0)ను ఔట్ చేసి ఇండియాకు డబుల్ షాక్ ఇచ్చాడు. ఇండియా 15 ఓవర్లలో 127/4తో నిలిచింది.
స్పిన్ ట్రాప్
ఈ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇండియాకు పాకిస్థాన్ స్పిన్ ట్రాప్ సెట్ చేసింది. ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. స్పిన్నర్లు సల్మాన్ అఘా, సయీం అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చేశారు. పేసర్ షహీన్ రెండు ఓవర్లు మాత్రమే వేశాడు.
మిస్టరీ స్పిన్నర్
డిఫరెంట్ బౌలింగ్ స్టైల్ తో వైరల్ గా మారిన పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ వికెట్ ను సాధించాడు. రనప్ తో వచ్చి క్రీజులో ఆగి బౌలింగ్ చేసే అతణ్ని ఇండియన్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు. కానీ ఆఖర్లో సూర్యకుమార్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చేశాడు. ఆఖర్లో శివమ్ దూబె (17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 27), రింకు సింగ్ (4 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ తో 11 నాటౌట్) మెరుపులతో ఇండియా స్కోరు 170 దాటింది.
ఒక్క పరుగు కూడా సాధించకుండానే తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ :
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్ధాన్ ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే తొలి వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్గా వెనుదిరిగిన ఫర్హాన్ (0) డౌకౌట్ అయ్యాడు. తొలి ఓవర్ మెయిడెన్ చేసిన హార్థిక్ పాండ్యా ఒక వికెట్తో రాణించారు.