Tuesday, 27 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీలో 17 మేయర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు...

12 Oct 2026
04:01 PM
306

* 5 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 5 జనరల్ మహిళలకు కేటాయింపు...
* విజయవాడ, తిరుపతి సహా 4 స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటన.. 
 Astranews : 
ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 252ను జారీ చేసింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు కేటాయిస్తూ  నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వేషన్ చెయ్యగా... జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను....నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది.

మంగళగిరి-తాడేపల్లి మేయర్ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా... కర్నూలు మేయర్ పదవి ఎస్సీ మహిళకు...రాజమహేంద్రవరం మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించింది. కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ పదవులు బీసీ జనరల్‌కు కేటాయించింది. 

వీటితో పాటు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప నగర పాలక సంస్థలతో పాటు జీవీఎంసీ మేయర్ పదవులను జనరల్ మహిళలకు సర్కార్ రిజర్వ్ చేసింది. ఇక మిగిలిన తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ పదవులు అన్‌రిజర్వ్‌డ్‌‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో, త్వరలోనే మున్సిపల్ రిజర్వేషన్లు....ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నగర పాలక సంస్థల రిజర్వేషన్ల కేటాయింపు ఇలా ఉంది  :
 Article Image

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!