Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

పాలు కాదు.. ప్రాణాలు తీసే విషం .. ! రాజమండ్రిలో ఇద్దరు బలి.. 13 మంది పరిస్థితి విషమం!

23 Feb 2026
12:12 PM
5

Rajahmundry :

మనం అమృతం అనుకుని తాగే పాలు.. అదే మన ప్రాణాలు తీసే విషంగా మారింది. రాజమండ్రిలో సరిగ్గా ఇదే జరిగింది. పొద్దున్నే లేచి తాజా పాలు అనుకుని తాగితే కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ ఘటనలో తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. మరో నలుగురు చిన్నారులు.. రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరికి ఒక్కసారిగా మూత్రం బంద్‌ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్‌ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు.

వ్యాపారి అరెస్ట్
బాధితులందరూ అనూరియా అనే వింత సమస్యతో బాధపడుతున్నారు. దీని అర్థం ఏంటంటే.. శరీరంలోని కిడ్నీలు దెబ్బతిని, మూత్రం రావడం పూర్తిగా ఆగిపోవడం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కల్తీ పాలు అమ్ముతున్న వ్యాపారిని అరెస్ట్ చేశారు. అధికారులు పాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఈ మరణాలు కచ్చితంగా కల్తీ పాల వల్లే జరిగాయా? లేక అపార్ట్‌మెంట్‌లోని వాటర్ ట్యాంకర్లు క్లీన్ చేయకపోవడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ సోకిందా? అన్న కోణంలోనూ డాక్టర్లు ఆరా తీస్తున్నారు. పూర్తి ల్యాబ్ రిపోర్ట్స్ వస్తేనే ఈ విషాదానికి అసలు కారణం ఏంటో తేలనుంది.

ల్యాబ్‌కు నమూనాలు  :
కల్తీ పాలతో నలుగురు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్‌ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.

5 రోజుల్లో 13 మంది బాధితులు?  :
చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 13 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, చౌడేశ్వరి నగర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

 :

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!