Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

రాయచోటి ప్రభుత్వాసుపత్రి నుంచి మాయమైన 104 వాహనాలు.. !

11 Feb 2026
06:58 PM
23


రాయచోటి ప్రభుత్వాసుపత్రి నుంచి మాయమైన 104 వాహనాలు.. !
మరమ్మత్తులున్నాయని పక్కన పెట్టిన అధికారులు...
డంపిండ్ యార్డ్ కు తరలించి జేసిబీలతో ధ్వంసం చేసిన గుర్తుకు తెలియని వ్యక్తులు..
అధికార పార్టీ నాయకులు, సొంత శాఖ సిబ్బంది పాత్రపై అనుమానాలు ?
  
అన్నమయ్య జిల్లా  :  

రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మరమ్మత్తుల కోసం ఉంచిన నాలుగు 104 వాహానాలు మాయమై ఎట్టకేలకు డంపిండ్ యార్డ్ లో ప్రత్యక్షమయ్యాయి.  చాలా కాలంగా  మరమ్మత్తులున్నాయని అధికారులు వీటిని అసుపత్రి అవరణంలో పక్కన పెట్టారు. అయితే వీటికి మరమ్మమత్తులు చెయ్యక వాడుకలోకి తీసుకురాకపోవడంతో నాలుగు వాహానాలు అలాగే మూలనపడ్డాయి. దీంతో ఓ వైపు వాహానాల అవసరం ఉన్నా మరమ్మమత్తులు చెయ్యకపోవడంతో అలానే వదిలేశారు. కానీ చాలా కిందటే వీటిని గుర్తుకు తెలియని వ్యక్తులు సమీపంలోని డంపిండ్ యార్డ్ కు తరలించి జేసిబీలతో ధ్వంసం చేశారు. ధ్వంసం చెయ్యడంతో పాటు వీటిలోని సామాగ్రి ని కూడా అమ్మేసుకున్నట్లు సమాచారం. అవరణంలో ఉంచిన వాహానాలు ఉన్నాయో లేవో కూడా అధికారులు వాటి వైపు కన్నేత్తి కూడా చూడలేదు. అందువల్లే వీటిని గుర్తుకు తెలియని వ్యక్తులు డంపింగ్ యార్డ్ కు తరలించి ధ్వంసం చేశారన్న టాక్ నడుస్తోంది. ఆ నోటా ఆ నోట పడిన ఈ సమాచారం, సోషియల్ మీడియాతో వైరల్ గా మారిన వీడియోలతో మరింత చర్చకు దారితీసింది. 

ఆరు మాసాల తరువాత పోలీసులకు ఫిర్యాదు : 
రాయచోటి అసుపత్రి అవరణంలో నాలుగు 104 వాహానాలను మరమ్మత్తుల కోసం ఉంచామన్న సృహ కూడా కోల్పోయిన వైద్యాధికారులు తీరిగ్గా నింపాదిగా అరు నెలల తరువాత ... వాహానాలు డంపిండ్ యార్డ్ లో ధ్వంసం అయ్యాకా పోలీసు స్టేషన్ లో వాహానాలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. 

Article Image

గుర్తుకు తెలియని వ్యక్తులు ఎవరు ? :
రాయచోటి నగరంలో ఉన్న అసుపత్రి అవరణంలోని 104 వాహానాలను గుర్తుకు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారంటూ ఫిర్యాదు అందింది. అయితే అంత పబ్లిక్ గా ఉన్న అవరణంలో ఉన్న వాహానాలను... అది కూడా మరమ్మత్తులకు వచ్చిన వాహానాలను తీసుకెళ్తుంటే చూసి వదిలేశారా లేక నిజంగానే చూడలేదా ? అన్నది అనుమానాలకు తావిస్తొంది. అంతేకాదు గుర్తుకు తెలియని వ్యక్తులు అంటే అధికార పార్టీ నాయకులేనా అంటూ చర్చ నడుస్తొంది. అంతేకాదు ఇంటి దొంగలు అంటే సొంత శాఖకు చెందిన సిబ్బంది పాత్ర ఎమైనా ఉందా అన్న మరో టాక్ లేకపోలేదు. మరి పోలీసులు విచారించి నింధితులను పట్టుకుంటారా లేక  అధికార పార్టీ అండ ఉందంటూ కాలయాపన చేస్తారా ? వేచి చూడాలి. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!