Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

చప్పగా నిర్మలమ్మ బడ్జెట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ... బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్లో భారీ పతనం... 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్...మార్కెట్లకు బడ్జెట్ ఎందుకు రుచించలేదు...

01 Feb 2026
03:09 PM
24


Budget 2026-27:

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈక్విటీ మార్కెట్లో నెగిటివ్ గా స్పందించడం ప్రారంభించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పైగా పతనం అవగా, నిఫ్టీ 500 పాయింట్లు పతనం అయింది. ఆ తర్వాత నెమ్మదిగా రెండు సూచనలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటిగంటకు నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 25095 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 690 పాయింట్లు నష్టపోయి 81575 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈక్విటీ మార్కెట్లో నెగిటివ్ గా స్పందించడం ప్రారంభించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పైగా పతనం అవగా, నిఫ్టీ 500 పాయింట్లు పతనం అయింది. ఆ తర్వాత నెమ్మదిగా రెండు సూచనలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటిగంటకు నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 25095 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 690 పాయింట్లు నష్టపోయి 81575 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. Hindalco Industries (-4.12 %), Coal India (-3.23 %), SBI (-3.09 %), Bharat Electronics (-2.92 %), Shriram Finance (-2.89 %) టాప్ లూసర్లుగా ఉన్నాయి. సెక్టార్లపరంగా చూసినట్లయితే దాదాపు అన్ని సెక్టార్లలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు ఒక శాతం పైనే నష్టపోయింది. అత్యధికంగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.81 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ కూడా 1.90 శాతం నష్టపోవడం చూడవచ్చు. అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ సైతం 0.89 శాతం నష్టపోయింది.

 


మార్కెట్లను కుంగ దీసిన కారణాలు ఇవే  :

2026 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెరివేటివ్స్ ట్రేడ్‌లపై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అధిక-వాల్యూమ్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ (F&O) విభాగంలో స్పెక్యులేటెడ్ ట్రేడింగ్‌ను అరికట్టే లక్ష్యంతో ఉన్న ఈ ప్రతిపాదనలో భాగంగా, ఫ్యూచర్స్‌పై STTని 0.02% నుండి 0.05%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆప్షన్‌లపై ప్రభావం మరింత స్పష్టంగా చూపించింది. ఆప్షన్ ప్రీమియంలపై పన్ను 0.1% నుండి 0.15%కి పెరిగింది. ఆప్షన్‌ల వినియోగంపై STT 0.125% నుండి 0.15%కి పెరనుంది.
డిఫెన్స్ రంగంపై ప్రధాన ప్రకటనలు లేవు..
రక్షణ రంగానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేస్తారని అంతా అనుకున్నారు కానీ అలాంటి ప్రకటనలేవీ లేవు దీంతో డిఫెన్స్ స్టాక్స్ రెడ్ జోన్‌లోకి వెళ్లాయి. అయితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రంలో, రక్షణ కోసం మూలధన వ్యయం రూ. 2.2 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇది గతంలో కన్నా ఎక్కువ.
PSU బ్యాంకులు కుప్పకూలాయి
బ్యాంకింగ్, ఆర్థిక రంగాన్ని సమీక్షించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించిన తర్వాత, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్‌లు భారీగా నష్టపోయాయి.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!