Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

త్వరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్... ఈ యేడాది బడ్జెట్ లో ... ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ ప్రసంగంలోని 10 టాప్ అంశాలు !

01 Feb 2026
03:43 PM
43


Budget 2026   :

ఎన్డీయే ప్రభుత్వంలో మూడో పూర్తిస్థాయి బడ్జెట్‌ను,  వ్యక్తిగతంగా తన 9వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 10 టాప్ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 
 
నిర్మలమ్మ ప్రసంగంలోని 10 ప్రధానాంశాలు :
 
1. త్వరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా :  
భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు.

2.. జీడీపీ వృద్ధి : 
గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా నమోదైందని, ఇది మన ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని వెల్లడించారు. *నాలుగు పిల్లర్లపై దృష్టి: ఈ బడ్జెట్‌లో ప్రధానంగా పేదలు, యువత, అన్నదాతలు, మహిళలు అనే నాలుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
 
3. నాలుగు పిల్లర్లపై దృష్టి :  
ఈ బడ్జెట్‌లో ప్రధానంగా పేదలు, యువత, అన్నదాతలు, మహిళలు అనే నాలుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

4.పేదరిక నిర్మూలన : 
పేదరికాన్ని పూర్తిగా తరిమికొట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. 

5. ఉపాధి కల్పన: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి తయారీ రంగం, నైపుణ్యాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు చెప్పారు.

6.  రైతుల సమృద్ధి  :
 రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
 
7. ఉపాధి కల్పన : 
యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి తయారీ రంగం, నైపుణ్యాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు.

8. ఎగుమతుల జోరు : 
దేశీయ ఎగుమతులను పెంచడం ద్వారా గ్లోబల్ మార్కెట్లలో భారత ముద్రను బలోపేతం చేశామని, దీన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. 

9. ఆర్థిక సంస్కరణలు : 
అభివృద్ధికి ఊతమిచ్చేలా, పెట్టుబడులను ఆకర్షించేలా మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. *ఇంధన భద్రత: భవిష్యత్తు అవసరాల కోసం గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ సెక్యూరిటీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందన్నారు. 

10. స్థిరమైన అభివృద్ధి : 
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే, సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చరిత్రలో మొదటిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ ఒక అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించారు.  

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!