
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌పైనే అందరి ఆశలు.. కేంద్ర బడ్జెట్ సమయం దగ్గర పడే కొద్ది మధ్యతరగతి నుంచి ప్రతిఒక్కరిలో టెన్షన్ మొదలైంది.. ఫిబ్రవరి 1,2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయి? ఎవరికి ఏ వర్గానికి మినహాయింపులు, ఉపశమనాలు ఉంటాయా? అని ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా లక్షలాది మంది గృహ రుణదాతలు, మధ్యతరగతివారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి గృహ రుణాలు, పన్ను మినహాయింపుల చుట్టూ భారీ సస్పెన్స్ కొనసాగుతోంది. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరుగుతున్న గృహ ధరలు, వడ్డీ రేట్ల మధ్య ఈ బడ్జెట్‌లో ఈఎంఐల భారాన్ని తగ్గించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం సామాన్యులు సైతం ఎదురుచూస్తున్నారు.
* వడ్డీ రాయితీ పరిమితి మారుతుందా ? :
వడ్డీ రాయితీ పరిమితి మారుతుందా అన్న దానిపై అందరిలోను చర్చ నడుస్తొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(b) కింద గృహ రుణ వడ్డీకి గరిష్ట మినహాయింపు రూ.2 లక్షలుగా ఉంది. 2014-15 నుంచి ఈ పరిమితి మారలేదు. గత 10 ఏళ్లలో ఇంటి ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ పరిమితిని కనీసం రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ ఉందని ఆర్థిక నిపుణులు, సీఆర్ఈడీఏఐ వంటి సంస్థలు చెబుతున్నాయి.
* ఈఎంఐల భారం తగ్గుతుందా? పెరుగుతుందా? :
పేద, మధ్య తరగతి ప్రజల నడ్డీ విరుస్తున్న ఈఎంఐల భారం పెరుగుతుందా తగ్గుతుందా. దీనిపై చాలా మంది ఆశలు పెంచుకున్నారు. వాస్తవానికి బడ్జెట్ నేరుగా బ్యాంకు వడ్డీ రేట్లను నిర్ణయించదు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేయాల్సిన పని. కానీ, బడ్జెట్ విధానాలతో ఈఎంఐ ఎంత అనేది నిర్ణయించే వీలుంది. దీంతో చాలా మంది ఈ దిశగా ఆశలు పెంచుకున్నారు.
* గృహా నిర్మాణాలకు మరింత మందికి అవకాశం లభిస్తుందా :
ప్రభుత్వం సరసమైన గృహాల విషయంలో (ప్రస్తుతం రూ. 45 లక్షలు) నుంచి రూ. 65-75 లక్షలకు మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మరింత మంది సబ్సిడీ, చౌక రుణాల పరిధిలోకి వస్తారు. సొంతిళ్లు లేని వారు కూడా ఈ నిర్ణయంపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.
* పన్ను ఆదా : పన్ను మినహాయింపు పరిమితి పెరిగితే మీ పన్ను ఆదా పెరుగుతుంది. తద్వారా ఈఎంఐల భారం కూడా తగ్గుతుంది.
*. సెక్షన్ 80C, అసలు తిరిగి చెల్లింపు :
గృహ రుణ అసలు మొత్తం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఇందులో సమస్య ఏమిటంటే.. రూ. 1.5 లక్షలలో PPF, LIC, పిల్లల ఫీజులు కూడా ఉన్నాయి. ఇళ్లు కొనుగోలుదారులు భారీగా రిలీఫ్ పొందాలంటే గృహ రుణంలో అసలు మొత్తం తిరిగి చెల్లించడంపై ప్రత్యేకంగా మినహాయింపు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
*.. కొత్త పన్ను విధానంపై సస్పెన్స్ :
ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో గృహ రుణ వడ్డీపై ఎలాంటి మినహాయింపు లేదు. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం గృహ రుణాలు, ఇన్సూరెన్స్‌పై కూడా మినహాయింపులను అందిస్తుందని మధ్యతరగతి ఆశగా ఎదురుచూస్తోంది.
* నేడు రూపాయి స్థాయి :
"యూరప్‌తో సంభావ్య వాణిజ్య అవగాహనపై ఆశావాదం సెంటిమెంట్‌కు మద్దతు ఇవ్వడంతో రూపాయి 91.70 వద్ద బలపడింది, దాదాపు 0.16 పైసలు లాభపడింది. మూలధన మార్కెట్ సెషన్ రెండవ భాగంలో షార్ట్ కవరింగ్ స్థిరమైన మూలధన ప్రవాహాల అంచనాలను మరింత పెంచింది. బుధవారం చివరిలో ఫెడ్ విధాన నిర్ణయం వెలువడనున్నందున, రూపాయి ప్రపంచ సంకేతాలను నిశితంగా ట్రాక్ చేసే అవకాశం ఉంది.
*.డెట్ మ్యూచువల్ ఫండ్లకు పన్ను సమానత్వాన్ని పునరుద్ధరించండి. :
"మనం బడ్జెట్ 2026ని సమీపిస్తున్నప్పుడు, భారత మూలధన మార్కెట్‌ను అర్థవంతంగా బలోపేతం చేయగల ఒక సంస్కరణ ఏమిటంటే, రుణ మ్యూచువల్ ఫండ్లకు పన్ను సమానత్వాన్ని పునరుద్ధరించడం మరియు అదే ఈక్విటీ లాంటి పన్ను చికిత్సను AIFకి విస్తరించడం. మార్చి 2023లో రుణ మ్యూచువల్ ఫండ్‌లకు ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించబడినప్పుడు, తక్షణ ప్రభావం పడింది.