Union Budget 2026 :
ట్యాక్స్ చెల్లించేవారికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గుడువును మరింత పొడిగించారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేయడానికి జులై 1 వరకు సమయమిచ్చారు. ఇక ఆడిట్ కాని వ్యాపార కేసులు, ట్రస్ట్‌లకు ఆగస్ట్ 31 వరకు గుడువు పొడిగిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నామమాత్రపు ఆలస్యపు రుసుంలతో డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు రిటర్న్స్‌లను సవరించడానికి ఉన్న గడువును పొడిగిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. పన్నుల చెల్లింపు విధానాన్ని మరింత సరళీకృతం చేసినట్లు తెలిపారు. డిజిటల్ మయం చేశామని, సామాన్య పన్ను చెల్లింపుదారులు కూడా మరింత సులభంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేలా పలు మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తక్కువ / లోయర్ పన్ను మినహాయింపు సర్టిఫికేట్లు కావాల్సిన చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆటోమేటిక్ వ్యవస్థను సీతారామన్ ప్రకటించారు.
ట్టుబడిదారులకూ ఉపశమనం లభించింది. డిపాజిటరీలు నేరుగా ఫారమ్ 15జీ, 15హెచ్‌లను సేకరించి కంపెనీలకు పంపడానికి అనుమతిస్తారు. తద్వారా పలు సంస్థలలో సెక్యూరిటీలు ఉన్న వారికి ఈ నిబంధనలను పాటించడం, ఐటీఆర్ ను దాఖలు చేయడం సులభతరమౌతుంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సవరించడానికి మరింత ఎక్కువ సమయం పొందవచ్చు. ఐటీఆర్ సవరణల గడువును డిసెంబరు 31 నుండి మార్చి 31 వరకు పొడిగించారు. దీనికి కొంత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను దాఖలు క్యాలెండర్ కూడా మారుతుంది.. దీనివల్ల. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు జూలై 31వ తేదీ చివరి గడువుగా ఉంటుంది. ఆడిట్ అవసరం లేని వ్యాపారాలు, ట్రస్టులు ఆగస్టు 31 వరకు తమ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో తలెత్తే వివాదాలను తగ్గించడానికి ఈ విధానంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు నిర్మల సీతారామన్. ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు ఈ బడ్జెట్‌లో ప్రధానాంశం. అసెస్‌మెంట్స్, జరిమానాలను విలీనం చేయాలని సీతారామన్ తాజాగా ప్రతిపాదించారు. అప్పీళ్ల సమయంలో తప్పనిసరిగా చెల్లించాల్సిన ముందస్తు చెల్లింపును 20 నుండి 10 శాతానికి తగ్గించారు. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నప్పుడు పన్ను చెల్లింపుదారులు జరిమానా మొత్తాలపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. మొదటి అప్పీలేట్ అధికారి ముందు అప్పీల్ కాలానికి, దాని ప్రక్రియ ఫలితంతో సంబంధం లేకుండా, జరిమానా మొత్తంపై పన్ను చెల్లింపుదారునికి ఎలాంటి వడ్డీ ఉండబోదని ఆమె పేర్కొన్నారు.
మరొక మార్పు- అసెస్‌మెంట్ ప్రారంభమైన తర్వాత కూడా అదనంగా 10 శాతం పన్ను చెల్లించి రిటర్న్‌లను అప్‌డేట్ చేసుకోవడం. వివాదాలను తగ్గించే క్రమంలో అసెస్‌మెంట్ ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను అప్‌డేట్ చేయడానికి, సంబంధిత సంవత్సరానికి వర్తించే రేటు కంటే అదనంగా 10 శాతం పన్ను రేటుతో అనుమతించాలని ప్రతిపాదిస్తున్నానని నిర్మల సీతారామన్ చెప్పారు. అసెసింగ్ అధికారి తన విచారణలలో ఈ అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను మాత్రమే ఉపయోగిస్తారని వివరించారు.